ఎస్సై అశోక్ జన్మదిన వేడుకలు

ఎస్సై అశోక్ జన్మదిన వేడుకలు
వెల్దుర్తి జులై 8 యువతరం న్యూస్:
వెల్దుర్తి ఎస్సై అశోక్ జన్మదిన వేడుకలను సోమవారం జర్నలిస్టులు, స్థానిక సిబ్బంది, ప్రజా సంఘాలు కలిసి ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వారంతా కోరారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి ఎస్ఐ అశోక్ ధన్యవాదాలు తెలిపారు. ఎస్సైగా విధులలొ చేరిన నాటినుండి విధి నిర్వహణలో ఎస్సై అశోక్ తన ముద్రను కొనసాగిస్తున్నారు. ఎస్సై అశోక్ అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపి వెల్దుర్తి మండలాన్ని ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న తీరును ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు. దీంతో ఎస్ఐ అశోక్ కు అన్ని రంగాల నుండి అభిమానులు ఏర్పడడం గమనించదగ్గ విషయం. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్ఐ అశోక్ జన్మదిన వేడుకలను సాదాసీదాగా ఆయన అభిమానులు అందరూ కలిసి నిర్వహించడం విశేషం.