వెల్దుర్తి పంచాయతీలో అక్రమాలు
మాజీ ఎంపీపీ తెలుగుదేశం సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్

వెల్దుర్తి పంచాయతీలో అక్రమాలు
వ్యక్తిగత దూషణలకు దిగవద్దు
వెల్దుర్తి జులై 6 యువతరం న్యూస్:
వెల్దుర్తి మేజర్ పంచాయతీ అక్రమాలకు నిలయంగా మారిందని మాజీ ఎంపీపీ తెలుగుదేశం సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్ ఆరోపించారు. శనివారం ఆయన స్వగృహంలో తన అనుచరులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకవచనం మరియు వ్యక్తిగత దూషణలు మంచివి కాదన్నారు. వెల్దుర్తి మేజర్ పంచాయతీ అక్రమాలకు నిలయంగా మారిందన్నారు. వాటిని అన్నిటిని రుజువు చేస్తామని సందర్భంగా తెలిపారు. ప్రజలకు తాగడానికి నీళ్లు అడిగితే మహిళను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం మీకే చెల్లిందని వైసీపీని నిలదీశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ దళిత సర్పంచులు అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులు రాజకీయం చేయడం వారి విజ్ఞతకే వదిలిస్తున్నామన్నారు. తమ నాయకులు ఎవరు మహిళా సర్పంచును ఎలాంటి దూషణ చేయలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ అని ప్రపంచానికి తెలుసు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.