హత్య రాజకీయాలకు కేరాఫ్ ఎవరో అందరికీ తెలుసు
తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు

హత్య రాజకీయాలకు కేరాఫ్ ఎవరో అందరికీ తెలుసు
అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకపోతున్న వైసిపి
వెల్దుర్తి జులై 6 యువతరం న్యూస్:
వెల్దుర్తి మండలం లో హత్య రాజకీయాలకు కేరాఫ్ ఎవరో అందరికీ తెలుసని మండల తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్యా రాజకీయాలను బొమ్మిరెడ్డి పల్లెకు పాకించింది ఎవరో ప్రజలు అందరికీ తెలుసు అన్నారు. తెలుగుదేశం మెజార్టీని జీర్ణించుకోలేక తమ కుటుంబంలో ఒకరిని బలి తీసుకున్నారని బొమ్మిరెడ్డి పల్లె పల్లె సుబ్బరాయుడు ఆవేదన వెల్లుబుచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ తమ నాయకుడు మహిళా సర్పంచులు ఎలాంటి దోషములు చేయలేదన్నారు. వెల్దుర్తి పట్టణంలో నెలకొన్న మంచినీటి సమస్యకు ఎవరైనా అడ్డువస్తే పోలీసులు కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకువెళతారని తెలిపినట్లు వారు తెలిపారు. వైసీపీ నాయకులకు హత్య రాజకీయాలు చెల్లు అన్నారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలను ప్రోత్సహించడని తెలిపారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని అత్యంత దారుణంగా చంపించింది ఎవరో అందరికీ తెలుసు అన్నారు. కులం పేరుతో రాజకీయాలు చేయవద్దని తెలుగుదేశం నాయకులు వైసిపికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.