శ్రీశైల మహా క్షేత్రం నందు భక్తులను అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీశైల మహా క్షేత్రం నందు భక్తులను అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీశైలం ప్రతినిధి జులై 5 యువతరం న్యూస్:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రం నందు దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపదంలో భాగంగా నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు శ్రీ భరత్ కుమార్ వారి బృందం హైదరాబాద్ వారిచే సాంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద శనివారం రోజు సాయంకాలం నుండి ఈ సాంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమంలో వినాయక స్తుతి ఏకదంతాయ శివారాధన శంభో శంభో శంభో శంకర గంగాధర శంకర తదితర గీతాలకు ఆశ్రిత తేజస్విని కీర్తి ప్రియా భవ్య శ్రీతదితరులు ఈ సాంప్రదాయ నృత్య ప్రదర్శన చేయడం జరిగింది.
అలాగే రెండవ కార్యక్రమంలో భాగంగా;
పద్మ వెంకటేశం మరియు వారి బృందం సికింద్రాబాద్ వారికి సాంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమంలో భాగంగా మూషిక వాహన శివాష్టకం తాండవృత్యకరం తదితర గీతాలను శివకేశవ అక్షయ శ్రీ శశాంక్ వేదాంషి సహస్ర తదితరులు ఈ సాంప్రదాయ నృత్య ప్రదర్శన చేయడం జరుగుతుంది.
ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజు హరికథ బుర్రకథ సాంప్రదాయ నృత్యం వాయిద్య సంగీతం భక్తి రంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కంకరయాలని పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సాంప్రదాయ కలల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.