తెలుగు దేశంలో కోవర్టులు ఎవరో తేలాలి

తెలుగు దేశంలో కోవర్టులు ఎవరో తేలాలి
వెల్దుర్తి జులై 4 యువతరం న్యూస్:
వెల్దుర్తి మండలంలో తెలుగుదేశం పార్టీలో కోవర్టులు ఎవరో తేలాలి అని మాజీ ఎంపీపీ తెలుగుదేశం సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం ఆయన స్వగృహంలో ఆయన అనుచరులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రమైన వెల్దుర్తిలో వైసీపీ సర్పంచ్ కు చెందిన వారు పట్టణంలో సిసి రోడ్లు వేస్తున్నారని వాటిని నేను నిలుపుదల చేయించాను అన్నారు. అయితే తెలుగుదేశంలో కొందరి సహకారంతో సీసీ రోడ్లు పండ్లు యదేచ్చగా జరుగుతున్నాయి అన్నారు. సీసీ రోడ్ల వద్ద అధికారులు లేరని, తీర్మానాలు కూడా లేవని మరి పని ఎలా చేస్తారని నిలదీశారు. మరి ఇప్పుడు కోవర్టులు ఎవరని ఆయన ప్రశ్నించడం జరిగింది. తెలుగుదేశం నాయకుల వద్దకు వైసీపీ కి చెందిన కొందరు వెళ్లడం రావడం తన దగ్గర ఫోటోలు ఉన్నాయన్నారు. వైసీపీకి చెందిన వారిని వెంటపెట్టుకొని తిరగడం, వారికి పనులు చేయిస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు. సాక్షాదారాలతో పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ కు అన్ని వివరిస్తానన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేస్తామన్నారు. నాయకులు అందరూ విడివిడిగా ఉండడం వల్లే వైసీపీకి కొమ్ములు వచ్చాయన్నారు. వైసీపీ నాయకుల ఆగడాలను ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. వెల్దుర్తి పట్టణానికి తగినీటి సమస్య పరిష్కారం చేస్తామన్నారు. ఆ దిశగా చర్యలు కూడా తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.