సుపరిపాలనలో తొలి అడుగు

సుపరిపాలనలో తొలి అడుగు
వెల్దుర్తి జులై 3 యువతరం న్యూస్:
మండల కేంద్రమైన వెల్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సుపరిపాలనలో తొలగడుగు కార్యక్రమాన్ని జిల్లా సీనియర్ తెలుగుదేశం నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. కాస్త ఓపికతో వైసిపి ఉంటే అన్ని పథకాలు అమలు అయ్యే విధానాన్ని చూడవచ్చు అన్నారు. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా దీపం పథకం, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఇవ్వడం జరిగిందన్నారు. అతి త్వరలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీ తప్పకుండా నెరవేరుస్తానని ఈ విషయాన్ని వైసిపి నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తెలుగుదేశం ను చూసి వైసిపి జడుసుకుంటుందన్నారు.