ఆపదలో అండగా అగ్నిమాపక విభాగం

ఆపదలో అండగా అగ్నిమాపక విభాగం
పిలిచిన వెంటనే పలికి ప్రమాద ప్రాంతానికి పరుగులు పెట్టే సిబ్బంది
సర్వత్ర ప్రశంసల జల్లు
ఉత్తరాంధ్ర ప్రతినిధి
జూన్ 8 యువతరం న్యూస్:
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం పరిధిలో 49 వ వార్డు ఎన్జీవోస్ కాలనీ కొండవాలు ప్రాంతంలో ఆకతాయిలు చెత్తకు మంట పెట్టారు చెత్తకు మంట పెట్టిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసి చెట్లతో కూడిన కొండకు వ్యాప్తి చెందకుండా నిరోధించారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఇక్కడ ఆకతాయిల బెడద ఎక్కువగా ఉందని పోలీసు వారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఎ డిఎఫ్ ఓ మాట్లాడుతూ స్థానికులు ఇక్కడ చెత్తా చెదారం వేయరాదని ఇలా ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని హితువు పలికారు ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఏడిఎఫ్ఓ కేవిటి ప్రసాద్ ఎల్ ఎఫ్ ఆర్ చిన్న ఎల్ ఎఫ్ డి అర్జున్ డి ఓ పి సిహెచ్ రమేష్ బాబు ఫైర్ మాన్ గజపతి తిరుమల ప్రసాద్ పాల్గొన్నారు