ANDHRA PRADESHSOCIAL SERVICE
వధూవరులకు తాళిబొట్టు అందిస్తున్న అటేకల్ టిడిపి యువనేత రాజశేఖర్

వధూవరులకు తాళిబొట్టు అందిస్తున్న అటేకల్ టిడిపి యువనేత రాజశేఖర్
ఆస్పరి 24 మే యువతరం న్యూస్
మండలంలోని అటేకల్ గ్రామానికి చెందిన హరిజన ప్రసాద్, దివ్య దంపతుల వివాహానికి రూ 15000 విలువ చేసే తాళిబొట్టు, మెట్టెలు అటేకల్ టిడిపి యువ నేత రాజశేఖర్ శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన హనుమంతు, లక్ష్మీ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో తన కొడుకు వివాహానికి తనవంతుగా సహాయం అందించినట్లు తెలిపారు. గ్రామంలో నిరుపేద కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ సంజన, బిలేకల్ కృష్ణ, మహేష్, బోయ లక్ష్మన్న, అంజి, నాగన్న, ఎల్లప్ప, బంగారి పాల్గొన్నారు.