ANDHRA PRADESHDEVOTIONALWORLD
వెల్దుర్తి మండలంలో ఘనంగా శ్రీ హనుమాన్ స్వామి వారి జయంతి వేడుకలు

వెల్దుర్తి మండలంలో ఘనంగా శ్రీ హనుమాన్ స్వామి వారి జయంతి వేడుకలు
వెల్దుర్తి మే 23 యువతరం న్యూస్:
వెల్దుర్తి మండలం లో శ్రీ హనుమాన్ స్వామి వారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
వెల్దుర్తి సమీపంలో జాతీయ రహదారి 44 పక్కన 51 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయాన్ని పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం స్వామి వారి రథోత్సవం వెల్దుర్తి పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ వెంట వెల్దుర్తి మండల తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.