ANDHRA PRADESHOFFICIAL
సర్వే నంబర్ 247 లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం

సర్వే నంబర్ 247 లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం
వెల్దుర్తి మే 21 యువతరం న్యూస్:
ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేస్తామని వెల్దుర్తి మండల తహసిల్దార్ చంద్రశేఖర్ వర్మ పేర్కొన్నారు. మంగళవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మండలం లో ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు, వంకలు, వాగులు, డొంకలు ఆక్రమించుకొని నిర్మించిన ప్రతి నిర్మాణాన్ని తొలగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ముఖ్యంగా మండల కేంద్రమైన వెల్దుర్తి లోని సర్వేనెంబర్ 247 లో ఉన్న అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. నోటీసులకు స్పందించకపోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు.