ANDHRA PRADESHBREAKING NEWSSTATE NEWS

వృద్ధురాలి ప్రేమకు ముగ్ధులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

వృద్ధురాలి ప్రేమకు ముగ్ధులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తన విజయం కోసం మొక్కులు చెల్లించిన పోతుల పేరంటాలమ్మతో కలసి భోజనం

పిఠాపురంలో పవన్ గెలుపును కాంక్షిస్తూ వేగులమ్మకు మొక్కిన పేరంటాలమ్మ

పింఛన్ సొమ్ముతో మొక్కులు చెల్లింపు

అమరావతి ప్రతినిధి మే 10 యువతరం న్యూస్:

గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ వేగులమ్మ అమ్మవారికి మొక్కులు మొక్కి… తన పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించారు. పిఠాపురం నియోజకవర్గం వై.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన వృద్ధురాలు పోతుల పేరంటాలమ్మ పింఛను సొమ్ము దాచుకొని అమ్మవారికి రూ.27వేల విలువైన గరగ చేసి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆమె( పేరంటాలమ్మ)ను శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని ముచ్చటించారు. తనపై చూపిన మమకారానికి ముగ్దులయ్యారు. పేరంటాలమ్మతో కలసి భోజనం చేశారు. ఆత్మీయంగా పలుకరిస్తూ స్వయంగా భోజనం వడ్డించారు. చీరను బహుకరించారు. పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించిన విషయం తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు. పేరంటాలమ్మను క్యాంపు ఏర్పాటుకి ఆత్మీయంగా ఆహ్వానించిన పవన్ కళ్యాణ్, తిరుగు ప్రయాణానికి చేసిన వాహనం వరకు స్వయంగా వచ్చి మరీ మరీ సాగనంపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!