దేశ రక్షణకు ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ కు ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

దేశ రక్షణకు ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ కు ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
కర్నూలు ప్రతినిధి మే 09 యువతరం న్యూస్:
దేశ రక్షణకు ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఘనంగా నివాళులు అర్పించారు..
శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన అనంతరం సాయంత్రం 5.55 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకున్న ముఖ్యమంత్రి కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండ పంచాయతీకి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు..వీర మరణం పొందిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రార్థిస్తూ, వారి చిత్రపటం ముందు పుష్పగుచ్ఛాన్ని ఉంచి, ఘనంగా నివాళులు అర్పించారు..
ముఖ్యమంత్రి తో పాటు ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్, డీఐజీ కోయ ప్రవీణ్, నంద్యాల జిల్లా ఎస్పీ, కర్నూలు జిల్లా ఇంచార్జి ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తదితరులు కూడా వీర సైనికుడు మురళీ నాయక్ కు నివాళులు అర్పించారు. అనంతరం కర్నూలు ఎయిర్ పోర్టు నుండి ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్ళారు.