ANDHRA PRADESHCRIME NEWSOFFICIAL
కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు

11 మందికి జీవిత ఖైదు
కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు
చెరుకులపాడు, తోగర్చేడు తదితర ప్రాంతాలలో పోలీసు బందోబస్తు
వెల్దుర్తి మే 9 యువతరం న్యూస్:
గురువారం కర్నూలు జిల్లా కోర్టు సంచల తీర్పునిచ్చింది. 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు నివ్వడం జరిగింది. 2017 మే 21న వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన చెరుకులపాడు నారాయణరెడ్డి తోపాటు ఆయన అనుచరులు సాంబశివుడు లు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 11 మందికి జీవిత ఖైదు విధించారు. మరో 5 మంది పై ఉన్న కేసులను కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా వెల్దుర్తి మండలంలోని చెరుకులపాడు, క్రిష్ణగిరి మండలం లోని తొగర్చేడు గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదరావు, ఎస్సై అశోక్ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.