జాతీయ రహదారి 44 ప్రక్కన ఏర్పడిన భారీ గొయ్యి

జాతీయ రహదారి 44 ప్రక్కన ఏర్పడిన భారీ గొయ్యి
వెల్దుర్తి మే 9 యువతరం న్యూస్:
కర్నూలు సమీపంలో రింగ్ రోడ్డు వద్ద జాతీయ రహదారి 44 పక్కన దాదాపు మూడు గంటల సమయంలో అకస్మాత్తుగా రోడ్డు పక్కన భారీ గొయ్యి ఏర్పడింది. గొయ్యి ను గమనించిన అధికారులు ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను నిలుపుదల చేశారు. దీంతో జాతీయ రహదారి 44 పై భారీగా వాహనాలు నిలబడిపోవడంతో ట్రాఫిక్ ఏర్పడింది. వాహనాలను బ్రిడ్జి పై నుండి కొనసాగించారు. అదేవిధంగా వెల్దుర్తి సమీపంలో వాహనాలు నిలుపుదల వెల్దుర్తి సీఐ మధుసూదనారావు, ఎస్సై అశోక్ మరియు సిబ్బంది ట్రాఫిక్ సమస్యను పరివేక్షించారు. వాహనాలు భారీగా నిలబడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొద్ది వాహనాలు రామళ్లకోట నుండి ఓర్వకల్లు మీద కర్నూలుకు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని వాహనాలు లద్దగిరి మీదుగా కోడుమూరు వెళ్లి హైదరాబాద్ వెళ్లడం జరిగింది.