మన సాంప్రదాయ కళలను ప్రోత్సహించాలి


మన సాంప్రదాయ కళలను ప్రోత్సహించాలి
వాటికి జీవం పోయాలి.. జై శ్రీరామ్ కోలాట బృందం
తరతరాలుగా సాంప్రదాయ కళలను మన పెద్దలు మనకు ఇచ్చిన అమూల్యమైన సంపద
గ్రామ సర్పంచ్ చాగలేటి అర్జున్
ప్రస్తుత సమాజంలో మానవతా విలువలు లేకుండా పోతున్నాయి
చెంచుగాళ్ళ అయ్యవారు
వేసవి కాలం సెలవులు సరదా సరదా గా జాలీ జాలీగా గడిచిపోతున్న కోలాటం సంబరాలు..
మా మదిలో మెదిలే ఆలోచనలే కోలాటం ప్రదర్శనకు కార్యరూపం దాల్చింది
కోలాటం గురువులు చెంచుగాళ్ళ అయ్యవారు, గొందిపల్లె వంశీ
వేముల మే 08 యువతరం న్యూస్:
ప్రజా జీవితంలో అన్ని జానపద కళారూపాలతోపాటు ఈ కోలాట నృత్యం కూడా తెలుగు జానపదుల జీవితాలతో పెనవేసుకుపోయింది. పెద్దల్ని,పిల్లల్నీ అందర్నీ అలరించిన కళారూపం కోలాటం. కోలాట నృత్యాలు ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో రాత్రి పూట పొద్దు పోయేవరకూచేస్తూ వుంటారు. భక్తి భావంతో దేవుని స్తంభాన్ని పట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందూ కోలాటాన్ని ప్రదర్శిస్తారు. ఈ కోలాట నృత్యాలు పెద్ద పెద్ద తిరుణాళ్ళ సమయంలోనూ,దేవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరంగంగా వీధుల్లోనూ ప్రదర్శిస్తారు. మన సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ వాటికి జీవం పోయాలి. ఇంకా వివరాల్లోకి వెళితే….! కడపజిల్లా వేముల మండలం చాగలేరు గ్రామం ఎస్సీ కాలనీ లో వెలసిన శ్రీ సీతా రాముల స్వామి వారిని గ్రామ సర్పంచ్ చాగలేటి.అర్జున్, శ్రీ రామాలయం కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు దర్శించుకున్నారు. నీలి మేఘ శ్యామునికి చాగలేరు గ్రామ సర్పంచ్ చాగలేటి అర్జున్ భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరికాయ కొట్టి కోలాటం ప్రారంభించారు. ఈసందర్భంగా గ్రామ సర్పంచ్ అర్జున్ మాట్లాడుతూ….మన సాంప్రదాయ కళలను ప్రోత్సహించి వాటికి జీవం పోయాలన్నారు. పూర్వం మన పెద్దలు సాంప్రదాయ కళలను ప్రోత్సహించేవారు. అవి కాలక్రమేణా అంతరించే తరుణంలో కొంత మంది కళాకారులు అక్కడక్కడ వాటికి మళ్ళీ జీవం పోస్తున్నారు. మనం ఆధునిక యుగంలోకి అడుగుపెట్టినప్పటికి మన సాంప్రదాయ కళలను ఎప్పటికీ మర్చిపోకూడదు. తరతరాలుగా సాంప్రదాయ కళలను మన పెద్దలు మనకు ఇచ్చిన అమూల్యమైన సంపద, అలాంటి అమూల్యమైన సంపదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. అనంతరం కోలాటం గురువు చెంచుగాళ్ళ అయ్యవారు మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మానవతా విలువలు లేకుండా పోతున్నాయి.మన సాంప్రదాయ కళల వలన ప్రతి ఒక్కరు భగవంతుని పట్ల భక్తి భావం కలిగి ఉంటారు. గురువుల పట్ల వినయ విధేయత కలిగి, తోటి వారిని ప్రేమించ గలుగుతారన్నారు. ప్రతి ఒక్కరూ నైతిక విలువలు, మానవతా విలువలు కలిగి ఉంటారన్నారు. తదనంతరం కోలాటం గురువు గొందిపల్లె వంశీ మాట్లాడుతూ…. మా మదిలో ఒక ఆలోచన మెదిలింది. అది ఏమిటంటే..? మన సాంప్రదాయ కళలు అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడుకొనే బాధ్యత మనకు కూడా ఉంటుంది కదా అనే ఆలోచనలతో ఉండగా, స్కూల్ పిల్లలకు వేసవి కాలం సెలవులు రానే వచ్చాయి. పిల్లలు ఆటలు ఆడుకునే ప్రదేశానికి వెళ్లి, ఆ పిల్లలతో మేము కోలాటం నేర్పిస్తాము నేర్చుకుంటారా అని అడిగాము. వారు సంతోషంగా అంగీకరించారు. వాళ్ళ అంగీకారం మా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే మన సాంప్రదాయ కళలు మరుగున పడకుండా పిల్లల్లో నైతిక విలువలు, మానవతా విలువలను పెంపొందించవచ్చు అనే చిన్ని ఆశ మాలో కల్గింది.ఆ కోరికనే ఈ కోలాట ప్రదర్శనకు కార్యరూపం దాల్చింది.వెంటనే మేము పిల్లలందరూ కలిసి గ్రామ సర్పంచ్ అర్జున్ ను, శ్రీ రామాలయం కమిటీ సభ్యులను, పెద్దలను కోలాటం ప్రారంభోత్సవానికి ఆహ్వానించాము. వారందరూ ముందుకు వచ్చి మేము మంచి కార్యాన్ని తలపెట్టినందుకు మమ్మల్ని వారు అభినందించారు. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా.. రఘుకుల తిలక రారా నన్నెత్తి ముద్దు లాడెద రారా..అనే భక్తి పాటలకు చిన్నారుల కోలాట నృత్యం చూసే చూపురులను ఆకర్షించింది. సినిమా పాటల స్టెప్పులతో అద్భుతంగా కోలాటం ప్రదర్శిస్తున్న పిల్లలను చూసి పెద్దలు సంతోషంతో పరవశించిపోయారు. కోలాటం ప్రదర్శన కనుల పండుగగా సాగుతున్నది, సమయం తెలియలేదు తనివి తీర లేదు. శ్రీ సీతారాముల స్వామి వారి సన్నిధిలో పిల్లలకు ఉచితంగా కోలాటం నేర్పించడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు.ఈకార్యక్రమంలో శ్రీ రామాలయం పూజారి చాగలేటి భాస్కర్,చాగలేటి పెద్ద పుల్లయ్య, గొందిపల్లె రామచంద్ర ( మాజీ ఎంపీటీసీ),చాగలేటి రమణ, చెంచుగాళ్ళ శివ నారాయణ (రాజా), కంబటి హరి, కంబటి శ్రీనివాసులు, గొందిపల్లె గంగాధర్, దొడ్డిగాళ్ళ గంగులయ్య,చాగలేటి ఆనంద్ కుమార్, శెట్టిపల్లి చంటి, చాగలేటి ఆంజనేయులు ( పోస్ట్) గొందిపల్లె నరసింహులు, చాగలేరు ఎంపీ టీసి కంబటి లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.



