ANDHRA PRADESHOFFICIALWORLD
ఆపరేషన్ సిందూర్ పై హర్షం వ్యక్తం చేసిన ఎం.పి బస్తిపాటి నాగరాజు

ఆపరేషన్ సిందూర్ పై హర్షం వ్యక్తం చేసిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
కర్నూలు రూరల్ మే 8 యువతరం న్యూస్:
జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో కౌంటర్ దాడి చేయడాన్ని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు ఒక ప్రకటనలో ప్రశంసించారు. పాక్, పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేయడం తో వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని, అందులో కీలక ఉగ్ర నేతలు హతమయారన్నారు. పాక్ పై భారత్ జరిపిన దాడి ప్రతి భారతీయుడు హర్షించ దగ్గ విషయమని. పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందన్నారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన 26 మంది ఆత్మలు ఆపరేషన్ సింధూర్ తో శాంతించి ఉంటాయన్నారు..ఇక భారత్ పై ఎవరు దాడి చేయాలన్న భయపడేలా యుద్ధం చేస్తున్న ప్రధాని మోదీ కి ప్రతి భారతీయుడు అండగా నిలవాలన్నారు.