పదవ తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో గతంలో కన్నా నేడు మెరుగైన ఉత్తీర్ణత శాతం

పదవ తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో గతంలో కన్నా నేడు మెరుగైన ఉత్తీర్ణత శాతం
వెల్దుర్తి ఏప్రిల్ 24 యువతరం న్యూస్:
పదవ తరగతి పరీక్షల్లో వెల్దుర్తి మండలం గత విద్యా సంవత్సరం కన్నా నేడు ఉత్తీర్ణత శాతం మెరుగుపరుచుకుంది. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ఉత్తీర్ణత 47.90 శాతముగా నమోదు అయింది. నేడు 10వ తరగతిలో ఉత్తీర్ణత 61.74 శాతముగా నమోదయింది. మండల విద్యాధికారిని ఇందిర కృషి వలన ఉత్తీర్ణత శాతం మెరుగు అయినట్లు సమాచారం. అనునిత్యం ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు మెరుగైన సూచనలు చేస్తూ ఉత్తీర్ణత శాతం పెంచడంలో ఎంఈఓ విజయం సాధించారు. వెల్దుర్తి మండలం మొత్తం 920 మంది విద్యార్థిని, విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయడం జరిగింది. బాలురు 350 మంది పరీక్షలు రాయగా 127 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 570 మంది పరీక్షలు రాయగా 441 మంది విద్యార్థినిలు ఉత్తీర్తో సాధించారు.