బనగానపల్లెలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

బనగానపల్లెలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె ప్రతినిధి ఏప్రిల్ 21 యువతరం న్యూస్:
వేసవి కారణంగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని.. క్షేత్రస్థాయి ప్రజల నుంచి వచ్చే ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశించారు. ఈ రోజు సాయంత్రం బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే చట్టబద్ధంగా ఉన్న సమస్యల విషయంలో మంత్రి సంబంధిత అధికారులతో అక్కడిక్కడే ఫోన్ లో మాట్లాడి ఆయా సమస్యలకు పరిష్కరించడం జరిగింది. వేసవి కావడంతో ఎక్కువగా తాగునీటి సమస్యలు, సిమెంట్ రోడ్లు కావాలని ఆయా గ్రామాల ప్రజలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిరుద్యోగులు మంత్రి దృష్టికి తీసుకు రాగా ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ అర్జీలు స్వీకరణ కార్యక్రమంలో సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించడంతో బాధితుల నుంచి సర్వత్రా సంతోషం వ్యక్తమైంది. మంత్రి ఆధ్వర్యంలో నిర్వహంచిన ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.