మంగళగిరిలో పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

మంగళగిరిలో పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
నియోజకవర్గ వ్యాప్తంగా కేక్‌లు కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసిన నాయకులు
మసీదులు, చర్చిలు, ఆలయాల్లో చంద్రబాబు పేరుమీద ప్రత్యేక పూజలు
రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన నేతలు
మంగళగిరి ప్రతినిధి ఏప్రిల్ 21 యువతరం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఆదివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండి, రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేయాలని మసీదులు, చర్చిలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ముందుగా టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్లో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ఏపీ పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి సంస్థ చైర్మన్ నందం అబద్దయ్య స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కట్ చేసి నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని పార్టీ శ్రేణులు కోరుకున్నారు. ఈ సందర్భంగా నందం అబద్దయ్య మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజంటే పార్టీ శ్రేణులకు పండుగ రోజు అని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో ఆయన మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం తెచ్చిన మహోన్నత నాయకుని అడుగుజాడల్లో మనందరం నడవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు సైతం చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. సంక్షేమం అభివృద్ధిలో కానీ, యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనలో కానీ చంద్రబాబు నాయుడుకు ఎలాంటి పోటీ లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ ను కానీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లింది చంద్రబాబు నాయుడు మాత్రమే అని తెలిపారు. ఆయన వయసు 75 సంవత్సరాలు కానీ చంద్రబాబు ఆలోచనా విధానంలో, పనితనంలో నవయువకుడు నారా చంద్రబాబునాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివ శేషగిరిరావు, మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ భోగి కోటేశ్వరరావు, మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు, రాష్ట్ర తెలుగు మహిళ కార్యదర్శి వింజమూరి ఆశాబాల, మంగళగిరి పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వాకా మాధవరావు, మాజీ కౌన్సిలర్ రంగశెట్టి నరేంద్ర, గుంటూరు పార్లమెంటరీ పద్మశాలి సాధికార సమితి సభ్యులు బాలకృష్ణ, నాయకులు సర్దార్ దిండ్ల సత్యానందం, వాకా మంగారావు, కారంపూడి అంకమ్మరావు, షేక్ సుభాని, గుంటి నాగరాజు, వింజమూరి చంద్రశేఖర్, నల్ల గొర్ల శివరామకృష్ణ, సింహాద్రి బేబీ రాణి, షేక్ రజియా, కట్టెపోగు ఉదయ్ భాస్కర్, ఆకురాతి నాగేంద్రం, ఉద్దంటి గాంధీ, బిట్రా నాగరాజు, గంజి చంద్రశేఖర్, గంజి లక్ష్మయ్య, సైనాథం శ్రీనివాసరావు, ఏమిలేని రామ్మోహన్, ఆకురాతి లక్ష్మణ్,ఎడ్లూరి కోటేశ్వరరావు, ఒడిశా సురేష్, కొల్లి వేణుబాబు, షేక్ సుభాని, దామర్ల మోహన్, రంగశెట్టి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.