జర్మనీ అబ్బాయి- ఆంధ్ర అమ్మాయి ఒకటైన వేళ

జర్మనీ అబ్బాయి- ఆంధ్ర అమ్మాయి ఒకటైన వేళ
మంగళగిరి ప్రతినిధి ఏప్రిల్ 20 యువతరం న్యూస్:
జర్మనీలో పీహెచ్డీ చేస్తూ ఉద్యోగం చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయి… జర్మనీలో ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన అబ్బాయి ఇరువురు ఉద్యోగరీత్యా పరిచయమై అది కాస్త ప్రేమగా మారి ఇరువురు తల్లిదండ్రులు ఒప్పుకోవటంతో వివాహంగా మారి ఆ జంట ఒకటయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.
పెదవడ్లపూడికి చెందిన సుదర్శనం రవికుమార్, లక్ష్మీ కొండల రాణి దంపతుల కుమార్తె మౌనిక జర్మనీలో పీహెచ్డీ చేస్తూ ఉద్యోగం చేస్తుంది. జర్మనీలోనే ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన ఫాబియన్ డువెన్ బేక్ తో పరిచయమై, అది కాస్త ప్రేమగా మారి ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో ఆ జంటకు వివాహమైంది. పెదవడ్లపూడి భగవాన్ సత్య షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో ఆదివారం ఫాబియన్ డువెన్ బేక్, మౌనిక జంట వివాహం ఇరువురి బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది. మాజీ సర్పంచ్, టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్, శ్రీమతి పద్మలత దంపతులు నూతన వధూవరులు ఫాబియన్ డువెన్ బేక్, మౌనికలను శాలువాలతో సత్కరించి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ నూతన వధూవరుల దాంపత్య జీవితం ఆనందోత్సవాలతో సాగాలని ఆయన అన్నారు.