కర్నూలు జిల్లాలో వైసీపీకి భారీగా ఎదురు దెబ్బ

ఎమ్మిగనూరులో వైసీపీకి ఎదురు దెబ్బ
నంబూరి సురేష్ చౌదరి ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో వెయ్యి మందితో చేరికలు
ఎమ్మిగనూరు ప్రతినిధి ఏప్రిల్ 16 యువతరం న్యూస్:
కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి టీడీపీలోకి వైసీపీ నాయకులు చేరుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో వైసీపీ పార్టీకు చెందిన నంబూరి సురేష్ చౌదరి ఆధ్వర్యంలో వీరితోపాటు వారి అనుచరులు దాదాపు 1000 మంది టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు వారిని పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి చేస్తున్న నియోజకవర్గం అభివృద్ధిని చూసి పార్టీలోని చేరుతున్నామని, నమ్ముకున్న వారిని న్యాయం జరగాలంటే ఒక్క బీవీ కుటుంబంతోనే సాధ్యం అవుతుందని నమ్మకం ఉందన్నారు. వారు చేస్తున్న మంచి పనులకు తాము తోడుగా నిలిచేందుకు పార్టీలోకి చేరామన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా గెలిచేందుకు పార్టీలకు వచ్చిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఎమ్మిగనూరు అభివృద్ధిని తన తండ్రి బీవీ మోహన్ రెడ్డి చేసిన దానికంటే మరింత అభివృద్ధి చేసి తీరుతానని స్పష్టం చేశారు. వాటిలో చేరిన వారు పార్టీ బలోపతానికి కృషిచేసి ప్రతి ఒక్కరు కలిసి మెలిసి పోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కి వారు భారీ గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.