ANDHRA PRADESHCORRUPTIONCRIME NEWS

పేదల ఇంటి స్థలాల్లో డాన్ ఆకృత్యాలు

పేదల ఇంటి స్థలాల్లో డాన్ ఆకృత్యాలు

నకిలీ అనుబంధ పత్రాలు నకిలీ వాస్తవ పత్రాలతో హల్చల్

మృతి చెందిన తహసిల్దార్ పేరుతో నకిలీ వాస్తవ సర్టిఫికెట్ అలాగే అనుబంధ పత్రం

ఇది ఎలా సాధ్యం ఇలాంటివి ఇంకా ఎన్నో పుట్టించిన డాన్

బద్వేలు మున్సిపాలిటీ పలు సర్వే నెంబర్లలో భారీ నకిలీ అనుబంధ పత్రాలు

ఇంటి స్థలాలు పట్టాలు నకిలీ వాస్తవ పత్రాలు

అనేక ఇబ్బందులు పడుతున్న హక్కుదారులు

బద్వేలు ప్రతినిధి ఏప్రిల్ 16 యువతరం న్యూస్:

బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో డాన్ ఆకృత్యాలు ఇటీవల మరింత పెరిగిపోయాయి నకిలీ ఇంటి పట్టాలు నకిలీ అనుబంధ పత్రాలు
నకిలీ వాస్తవ సర్టిఫికెట్లు తయారు చేయించి అసలు హక్కుదారుల పై జులూమ్ చేస్తున్నారు అధికార పార్టీ అండతో డాన్ ఇటీవల మరింత రెచ్చిపోతున్నారు బద్వేల్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఆ డాన్ ఎవరు అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. బద్వేలు
పట్టణంలోని పలు సర్వే నెంబర్లలో ఈ డాన్
నకిలీ ఇంటి పట్టాలు నకిలీ అనుబంధ పత్రాలు
నకిలీ వాస్తవ పత్రాలు తయారు చేయించి హక్కుదారులపై ప్రతాపం చూపుతున్నారు ఈ విషయం సంబంధిత అధికారులకు బాగా తెలుసు ముఖ్యంగా బద్వేల్ పట్టణం నోబుల్ స్కూల్ సమీపంలో నకిలీ అనుబంధ పత్రం నకిలీ అనుబంధ పత్రాలు పుట్టించారు ఈ ప్రాంతంలో మూడు సెంట్లు 30 లక్షల రూపాయలు పైగా విలువ చేస్తుంది విలువైన ఇంటి స్థలాలపై నకిలీ ఇంటి పట్టాలు నకిలీ అనుబంధ పత్రాలు నకిలీ వాస్తవ పత్రాలు తయారు చేస్తున్నారు ఇదంతా డాన్ ఘనత అని చెప్పాలి ముఖ్యంగా కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన బద్వేలు మండల తాసిల్దార్ పేరుతో వీటిని పుట్టించడం విశేషం. చనిపోయిన తాసిల్దార్ పేరుతో నకిలీ అనుబంధాలు తయారు చేశారు బద్వేలు మండల తాసిల్దార్ కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయారు ఆ తాసిల్దార్ సంతకంతో నకిలీ అనుబంధ పత్రము వాస్తవ సర్టిఫికెట్ పుట్టుకు రావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది
ఇలాంటి నకిలీ అనుబంధ పత్రాలు నకిలీ వాస్తవ సర్టిఫికెట్లు ఎన్నో ఉన్నాయి ఇందుకు ప్రధాన కారణం డాన్ అని తెలుస్తుంది సంబంధిత అధికారులు నిజాయితీగా ఆ డాన్ పై చర్యలు తీసుకొని హక్కుదారులకు న్యాయం చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!