అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ తల్లి

అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ తల్లి
అమలాపురం ప్రతినిధి ఏప్రిల్ 11 యువతరం న్యూస్:
ఒక సేవాచిరునవ్వు ఆత్మీయ పిలుపు మంచితనం అమ్మతనంతో
కోనసీమలోని లంకల గన్నవరం
పల్లె ఇంకా దేశంలో చిగురిస్తూనే ఉంది
మీ త్యాగానికి
అన్న దీపమై
ప్రాణాలను నిలబెట్టిన
కీర్తి ప్రతిష్టలు
విర జిమ్ముతున్న కల్పవృక్షం
మీ పేరు/
అన్నదాతపై ఆనందాల వెలుగు దీపానివై అమ్మ ప్రేమకు గుర్తుగా జీవితాంతం
ఆకలి జీవితాలను ప్రేమగా ఆత్మీయంగా అనుబంధం కలిపావు/
నీ పేరు కోనసీమలోనే కాదు విశ్వంలోనే వెలుగుతోంది. రాత్రి పగలు లేకుండా కంటికి రెప్పవై
కాలాన్ని ఆపి అతిధి సేవలో తరించిన త్యాగమూర్తి వి
అన్ని దానాల్లో కన్నాఅన్నదానం గొప్పది నిరూపించారు/
డొక్కా సీతమ్మ తల్లి అపర అన్నపూర్ణ అమ్మా ఆకలి అంటే
అర్దరాత్రి అయినా ఆకలి తీర్చే కరుణా
హృదయం నీది/
ఆకలికి కులం లేదు మతం లేదని నిరూపించి
జీవితాన్ని నిరతా న్న ధాత్రిగా సార్ధకం చేసుకున్న త్యాగశీలి వి/
మండపేటలో అనుపిండి నర సమ్మ భవాని శంకరం పుణ్య దంపతులకు జన్మించి కోనసీమలోని లంకల గన్నవరం డొక్కా జోగయ్య ను వివాహం చేసుకుని అత్తవారింటికి అడిగిపెట్టి వచ్చిన వారందరికీ లేదనకుండా వంట వండి అన్నార్తులకు ఆకలి తీర్చే మీ మానవతా హృదయం హద్దులు లేనిది/
ఆకలి తీర్చడంలో అన్నార్తుల కోసమే నగలు భూములు విక్రయించిమహాత్యాగం చేసి జనవరిలో నిలిచావు/
బ్రిటిషుసామ్రాజ్య రాజధాని లండన్ మహానగరం నుండి ఏడవ ఎడ్వర్డ్ చక్రవర్తి రాజధర్బార్లో పట్టాభిషేక వార్షికోత్సవ సభకు రమ్మని ఆత్మీయ ఆహ్వానం పంపినానిత్యాన్నదాన నియమంగల డొక్కా సీతమ్మ తల్లి తిరస్కరించింది /
చివరకు ఆమె ఫోటోను రాజ దర్బార్ లోని తొలివరుసలో ఆవిష్కరించి నఅపూర్వ దృశ్యం చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం/
కాలం ఉన్నంతకాలం సీతమ్మ తల్లి
త్యాగం ఉదయిస్తూనే ఉంటుంది/
నడకకవి
డాక్టర్ నల్లా నరసింహమూర్తి
సీనియర్ తెలుగు లెక్చరర్
శ్రీ శ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు