శాంతి భద్రతలు ముఖ్యం

శాంతి భద్రతలు ముఖ్యం
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
వెల్దుర్తి ఏప్రిల్ 9 యువతరం న్యూస్:
జిల్లాలో శాంతిభద్రతలు ముఖ్యం అనే కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పార్టీలు పేర్కొన్నారు. మంగళవారం ఆయన వెల్దుర్తి మండలం లోని బొమ్మిరెడ్డి పల్లె గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో వీధి వీధులలో పర్యటించారు. ఈ సందర్భంగా గిరినాథ్ చౌదరి హత్య కేసు నిందితులు అయిన వెంకటేశ్వర్ రెడ్డి సోదరులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణమే ఏర్పరచాలని ఆయన వారితో పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని వీధి వీధి పర్యటించి తెదేపా జిల్లా సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు ని కలిశారు. గ్రామంలో ప్రశాంత వాతావరణము ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకు పోతుంది అని పేరుకున్నారు. గ్రామంలో శాంతిభద్రతల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్, కర్నూల్ వన్ టౌన్ సిఐ రామ నాయుడు, వెల్దుర్తి సీఐ మధుసూదనారావు, వెల్దుర్తి ఎస్ఐ అశోక్, క్రిష్ణగిరి ఎస్సై మల్లికార్జున పాల్గొన్నారు.