ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు

త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు
పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలు
మెగా అభిమానులకి కలవరపాటు
జీలుగుమిల్లి ఏప్రిల్ 09 యువతరం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదానికి గురైన విషయం తీవ్ర కలవరానికి కారణమైంది. సింగపూర్లో తన తల్లితో నివసిస్తున్న మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మార్క్ శంకర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఆయన కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలు కాగా, పొగ కారణంగా అస్వస్థతకు కూడా గురయ్యాడు.
ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ ఘటనపై సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు, నియోజవర్గ జనసేన అభిమానులు శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, కేటీఆర్, జగన్ తదితరులు కూడా సోషల్ మీడియా వేదికగా చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మెగా అభిమానులు, జనసైనికులు ఈ వార్త విని ఆందోళనకు గురవుతున్నారు.