అమ్మాయిల చదువు అభివృద్ధికి అడుగులు

అమ్మాయిల చదువు అభివృద్ధికి అడుగులు
బాల్యవివాహాలకు దూరంగా ఉండండి చదువుకు ప్రాధాన్యత ఇవ్వండి
బాలికలను చదివిద్దాం-బాలికలను రక్షిద్దాం
ప్రిన్సిపాల్ నాగవేణి
బుక్కరాయసముద్రం ఏప్రిల్ 5 యువతరం న్యూస్:
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో స్టానిక కస్తుర్భా గాంధీ బాలిక విద్యలయం నందు ఆర్.డి.టి మరియు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ నాగవేణి అధ్యక్షతన “బాలికలను చదివిద్దాం-బాలికలను రక్షిద్దాం”అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుమారి చరిత ఫెర్రర్ ఆర్ డి టి అనంతపురము, ఆర్ డి టి రిజినల్ డైరెక్టర్ లక్ష్మణరావు, ఐ సి డి ఎస్ సూపర్వైజర్ నాగమణి విచ్చేసినారు.
వారు మాట్లాడుతూ అమ్మాయిలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని అలాగే ప్రస్తుత సమాజంలో ఎదురైయ్యే సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రతి అమ్మాయి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని వాటిని చేరుకోవడానికి నిరంతరం సాధన చేయాలి మద్యలో ఎదురైయ్యే చిన్న చిన్న ఆకర్షణలకు లోనుకాకుండా ముందుకు సాగినపుడే అనుకున్న లక్ష్యం చేరుకుంటారని తెలియజేసినారు. తల్లిదండ్రులు చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల అమ్మాయిలు మానశిక, శారీరక ఒత్తిడికి గురి కావడం మరియు ప్రసవ సమయంలో తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోతారని తెలుపుతూ ఆడ పిల్లలకు 18 సంవత్సరాలు మగ పిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహ ప్రయత్నాలు చేయడం ఉత్తమము అని తెలియజేశారు అలా కాకుండా బాల్య వివాహం చేయాలని చూస్తే బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాo చేసుకున్న, నిర్వహించిన, సహకరించిన మరియు హాజరైన ప్రతి ఒక్కరూ శిక్షార్హులు ఇందుకు గాను రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా లేదా రెండు విదింప బడుతాయి అని తెలియజేస్తూ ఎక్కడైనా బాల్య వివాహాలు చేయాలని ప్రయత్నిస్తుంటే వెంటనే టోల్ ప్రీ నంబర్లు 1098, 100 మరియు 112 లకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటారని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డి టి మహిళా అభివృద్ధి విభాగం సమన్వయకర్తలు ఆదినారాయణ,అనిత,ప్రిన్సిపాల్ నాగవేణి,ఉపాధ్యాయులు, ఐ సి డి ఎస్ సూపర్వైజర్ నాగమణి,అంగన్వాడి కార్యకర్తలు మరియు చిన్నారులు పాల్గొన్నారు.