BREAKING NEWSOFFICIALSTATE NEWSTELANGANA

మెరుగైన వైద్య సేవలు అందించాలి మంత్రి సీతక్క

మెరుగైన వైద్య సేవలు అందించాలి
మంత్రి సీతక్క

వైద్యులు దేవుల్ల తో సమానం

వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలి

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క

ములుగు ప్రతినిధి ఏప్రిల్ 5 యువ తరం న్యూస్:

పలురకాలవ్యాధులతోబాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్న రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లపై నమ్మకం కలిగే విధంగా వైద్య సేవలు అందించాలని, మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య సిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు,శుక్రవారం జిల్లా ప్రధాన ఆసుపత్రి సమావేశ మందిరంలో జిల్లా లో పనిచేస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ప్రోగ్రాం ఆఫీసర్స్ , మెడికల్ ఆఫీసర్స్, ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్, జిల్లా వైద్య నిపుణులు , మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్, సిబ్బందితో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి
జిల్లా లో రోగులకు అందిస్తున్న వైద్యం పై పి హెచ్ సి ల వారిగా సమీక్షించారు,ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సాధారణ ప్రజలే మనకు దేవుళ్ళుగా భావించి మానవీయ కోణంలో, జనంతో మమేకమై ప్రజలు గుర్తించుకునేటట్లు, ప్రేమ ఆప్యాయతలతో మెరుగైన వైద్య సేవలు అందించాలని అప్పుడే సాధారణ ప్రజలకు వైద్య ఆరోగ్యశాఖ పట్ల
నమ్మకం కలుగుతుందని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు డాక్టర్లను దేవుళ్ళుగా భావిస్తారని తెలిపారు,
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు దేవుళ్ళతో సమానమని, వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు అందించిన పక్షంలో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించరనీ, రోగులు ప్రైవేట్ ఆస్పత్రులు పోకుండా సేవలందించాలని అన్నారు. జిల్లాలో ములుగు, ఏటూరు నాగారంలో ప్రధాన ఆస్పత్రిలో ఉన్నాయని, ప్రధాన ఆస్పత్రులతో పాటు ఇతర ఆసుపత్రులలో యువ వైద్యులు ఉన్నారని మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని అన్నారు,ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని, సీజనల్ వ్యాధులపై గ్రామాలలో అవగాహన సదస్సు నిర్వహించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది జవాబు తనంగా ఉంటూ వైద్య సేవలను కొనసాగించాలని, ప్రతి మండల కేంద్రంలో 108 వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలనే అన్నారు, అత్యవసర సమయాలలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి 108 సిబ్బంది 15 నిమిషాలలో ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించాలని అన్నారు,
ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల తీసుకునే జాగ్రత్తల పట్ల ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలను చేయాలని , ఆరోగ్య సిబ్బందికి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలను నిర్వహించుకుని జిల్లాలో చేయవలసిన సేవలను సమీక్షించూకోవాలని జిల్లా అధికారులను సూచించారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సమకూర్చవాల్సిన మౌలిక సదుపాయాల పై నివేదిక సమర్పించాలని, నిధులను మంజూరు చేస్తానని మంత్రి తెలిపారు,జిల్లా పేరును వైద్య సేవలో రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని మంత్రి కోరారు,జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. మాట్లాడుతూ ఎండాకాలంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలకు తగినన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలని, మందుల కొరత ఉన్నట్లయితే నా దృష్టికి తీసుకురావాలని నిధులను మంజూరు చేసి మందులను సమకూరుస్తామని అధికారులకు తెలిపారు,జిల్లా ప్రధాన ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ఆప్యాయతతో పలకరించి, మెరుగైన వైద్య సేవలను అందించాలని, సమస్యల పట్ల వారికి ఓపికతో అవగాహన కల్పించి తదుపరి వైద్య సేవల పట్ల వివరించాలని తెలిపారు,ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ జగదీశ్వర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ లాల్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ చంద్రకాంత్ డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ రణధీర్ జిల్లా ప్రధాన ఆస్పత్రి వైద్య నిపుణులు డాక్టర్ కిషోర్ డాక్టర్ ప్రేమ్ సింగ్ గైనకాలజిస్టులు ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ ఛాతి
వైద్య నిపుణులు కంటి వైద్య నిపుణులు చర్మ వైద్య నిపుణులు డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, పూర్ణ సంపత్ రావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!