బీఎల్‌వోలు నిబద్దతతో పనిచేయాలి

బీఎల్‌వోలు నిబద్దతతో పనిచేయాలి
కర్నూలు నియోజకవర్గ ఎన్నికల ఆర్వో, కమిషనర్ యస్.రవీంద్ర బాబు
కర్నూలు టౌన్ ఏప్రిల్ 3 యువతరం న్యూస్:
ఎన్నికల విధులను నిబద్దతతో పనిచేయాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు బీఎల్‌వోలకు సూచించారు. బుధవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో బీఎల్‌వోలకు వార్షిక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ.. ఫాం 6, 7, 8 లను నింపటంపై పూర్తి అవగాహనతో ఉండాలని, పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు అవసరమనుకుంటే తమ దృష్టికి తీసుకొని రావాలన్నారు. హ్యాండ్‌బుక్‌ను చదివి ఎన్నికల విధులు, నిబంధనలు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని బీఎల్వోకు కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, తహశీల్దార్ వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్లు మంజూరు భాష క్రిస్టోఫర్, డిప్యూటీ తహసిల్దార్ ధనుంజయ, ఆర్‌ఐలు భార్గవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.