సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో గ్రాడ్యేషన్ డే వేడుకలు

సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో గ్రాడ్యేషన్ డే వేడుకలు
విశాఖ ప్రతినిధి ఆగస్టు 31 యువతరం న్యూస్:
విశాఖపట్నంలోని సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా గ్రాడ్యేషన్ డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమం చిన్నారి గ్రాడ్యేట్లకు , వారి గర్వంతో నిండిన తల్లిదండ్రులకు, గురువులకు చిరస్మరణీయంగా నిలిచింది. ప్రీ-ప్రైమరీ విభాగానికి చెందిన కిండర్‌గార్టెన్ విద్యార్థులు నృత్యం, సంగీత ప్రదర్శనలతో తమ ప్రతిభను ఆవిష్కరించారు. వీరి ఆత్మవిశ్వాసం మరియు ప్రతిభను చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీమతి జి. భారతి, వైస్ ప్రిన్సిపాల్ ఆర్.ఎస్. శెట్టి, సమన్వయకర్తలు ఎం. శ్రీనివాస రావు, సుమ ప్రియా, అశ్విని హాజరై చిన్నారులకు గ్రాడ్యేషన్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం లో తల్లి తండ్రుల తరుపున సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతి రావు మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం నిర్వహించిన గ్రాడ్యేషన్ కార్యక్రమం విద్యార్థులలో ఆలోచనా శక్తిని పెంపొందించి చదువుల్లో ముందడుగు వేయడానికి దోహదపడుతుందన్నారు. సర్టిఫికేషన్ అందుకున్న చిన్నారులను అభినందించారు.
ఈ కార్యక్రమం, విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో మరియు వారిని ప్రోత్సహించడంలో స్కూల్ అంకితభావాన్ని మరోసారి రుజువు చేసింది. ఈ కార్యక్రమం లో చిరంజీవులు వేదుల కార్తికేయ, జితేంద్ర, కలిదా,అశ్రీమాలు తమ యాంకరింగ్ తో తల్లిదండ్రులను,ఆహూతులను అలరించారు.