ANDHRA PRADESHBREAKING NEWSWORLD

సజీవ సమాధి యత్నం

సజీవ సమాధి యత్నం

తాళ్లూరు పోలీసులు భగ్నం

ఇదంతా ప్రపంచ శాంతి కోసమట

ఉగాది రోజునే శివైక్యం కోరిక

మాజీ సర్పంచి కొడుకు విచిత్రం

ఊరంతా ఆందోళన

ఇదంతా ప్రచారం కోసమే : ఎస్ ఐ

ప్రకాశం ప్రతినిధి మార్చి 31 యువతరం న్యూస్:

ఉగాది పండుగ రోజునే ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు యత్నించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వారం రోజులు ధ్యానం ఉగాది రోజున శివైక్యానికి యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు భగ్నం చేశారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ కైపు అంజిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి సజీవ సమాధి కావాలని ఇటీవల నిర్ణయించుకున్నాడు. ఊరి శివారున తన పొలంలో పన్నెండ్ల కిందట తాను సొంతంగా నిర్మించిన భూదేవి ఆలయ ఆవరణలోనే సజీవ సమాధికి సిద్ధపడ్డాడు. ఇందుకు వారం కిందటే ఆలయం ఎదుట పెద్ద గుంత తవ్వి అందులోకి దిగి పైన రేకు కప్పుకున్నాడు. అందులోనే ఉండి ధ్యానం చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కోటిరెడ్డి తన కుమారుడితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. అనంతరం గుంతలో దిగి ధ్యానంలో నిమగ్నమయ్యాడు. అప్పుడు అతని కుమారుడు ఆ గుంతపై పెద్ద రేకు ఉంచి, దానిపై మట్టిపోసి పూడ్చివేశాడు. విషయం తెలుసుకున్న కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డి, మరికొందరు అక్కడకు చేరుకుని బయటకు రావాలని అడిగాడు. కానీ తన ధ్యానానికి ఎవరూ ఆటంకం కలిగించవద్దని కోటిరెడ్డి సూచించాడు. ఇలా ఎందుకు చేస్తున్నావని గ్రామస్తులు అడగ్గా.. ఈ ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని, కులమతాలు లేకుండా అందరూ ఐకమత్యంతో మెలగాలని కోరుకుంటూ దీక్ష తీసుకుని సజీవ సమాధి అవుతున్నానని కోటిరెడ్డి తెలిపాడు. ఇక చేసేదేమీ లేక అక్కడే ఉండిపోయారు. ఈ సమాచారం అందుకున్న తాళ్లూరు పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో కోటిరెడ్డిని బయటకు తీసుకొచ్చారు. కానీ పోలీసులు వెళ్లిపోయిన వెంటనే మళ్లీ కోటిరెడ్డి ఆ గుంతలోకి దిగి ధ్యానంలో నిమగ్నమయ్యాడు. కుటుంబసభ్యులు, స్థానికులు మళ్లీ చాలాసేపు బతిమిలాడటంతో బయటకొచ్చిన కోటిరెడ్డి ఇంటికి చేరుకున్నాడు. ఇదంతా ప్రచారం కోసం చేస్తున్న ప్రయత్నమేనని ఎస్సై మల్లిఖార్జున రావు తెలిపారు. కోటిరెడ్డి ఆరోగ్యంగానే ఉన్నాడని పేర్కొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!