జీలుగుమిల్లి మండలంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

జీలుగుమిల్లి మండలంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేనలో ఆర్యవైశ్య కుటుంబాల చేరిక
జనసేనలో 100 ఆర్యవైశ్య కుటుంబాలు చేరిన సందర్భంలో విశేష ప్రసంగం
మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపు
జీలుగుమిల్లి మార్చి 30 యువతరం న్యూస్ :
జీలుగుమిల్లి మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘ పెద్దలు, నాయకులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకత్వం, భావజాలం, సిద్ధాంతాలను నమ్మి చిర్రి బాలరాజు నేతృత్వంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ తెలుగు సంవత్సరం అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. 100 ఆర్యవైశ్య కుటుంబాలు జనసేనలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జనసేనను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. త్వరలోనే మండలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.