రైతు బాంధవులకు శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు

రైతు బాంధవులకు శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు
ప్రతి రైతు ఇంటా పాడి పంటలతో,ధన ధాన్యాలతో, సిరి సంపదలతో ,సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలి..
మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి
ముద్దనూరు మార్చి 30 యువతరం న్యూస్:
ముద్దనూరు మండల రైతు బాంధవులకు అందరికి శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అని మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ విశ్వా వసు నామ తెలుగు నూతన సంవత్సరం లో సకాలంలో మంచి వర్షాలు కురిసి,పాడి పంటలతో సమృద్ధిగా ఉండి,పండించిన ప్రతి పంటకు మద్దతు ధర లభించి, ప్రతి రైతుకు వ్యవసాయం లాభ సాటిగా ఉండి, పాడి పంటలతో, ప్రతి (లోగిలి)ఇంటా, ధన ధాన్యాలతో,ప్రతి పల్లె పసిడి(బంగారు) పంటలతో విరజిల్లాలని ఆయన అన్నారు.ప్రతి రైతు ఈ తెలుగు నూతన శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో సుఖ సంతోషాలతో ,ఆయురు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి అని,అలాగే ప్రతి పల్లె పసిడి పంటలతో వికసించాలి అన్నారు.ప్రతి రైతుకు వ్యవసాయం అంటే దండగ లాగా కాకుండా పండుగ లాగా ఉండాలి అని అన్నారు.