రంజాన్ తోఫా పంపిణీ

రంజాన్ తోఫా పంపిణీ
మంగళగిరి ప్రతినిధి మార్చి 28 యువతరం న్యూస్:
మంగళగిరి గుడ్ విల్ ముస్లిం సంక్షేమ కమిటీ కార్యాలయంలో రంజాన్ ను పురస్కరించుకొని గురువారం కమిటీ కన్వీనర్ ఇబ్రహీం, రోక్సాన బేగం దంపతులు ఆధ్వర్యంలో గురువారం పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. కమిటీ కన్వీనర్ ఇబ్రహీం, టీడీపీ మైనార్టీ నాయకులు చేతుల మీదుగా రంజాన్ తోఫాను అందజేశారు. 250 మంది ముస్లింలకు తోఫా అందజేశారు. అనంతరం టీడీపీ మైనార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ స్ఫూర్తితో గత 11 సంవత్సరాల నుంచి ఇబ్రహీం దంపతులు పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేయడం అభినందనీయమన్నారు. నంబూరు, తాడేపల్లి, మంగళగిరిలలో కమిటీ సుమారు 600 కుటుంబాలకు తోపా అందజేసిందన్నారు. ఇబ్రహీం కుటుంబానికి అల్లా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు పాతర్ల రమేష్, వెలపాటి విలియం, షేక్ జిలాని, మల్లెల నాగేశ్వరరావు, టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు గల్ఫ్ సుభాని, షేక్ సుభాని, రజాక్, సమీరా, ఎండి ఆరిఫ్, జావిద్, ఇస్మాయిల్, అలీ, తెలుగు మహిళా నాయకురాలు కర్లపూడి వెంకాయమ్మ, తహసీన్ తదితరులు పాల్గొన్నారు.



