దేశాయి లక్ష్మీదేవమ్మ ఎంపీపీగా ఏకగ్రీవం

దేశాయి లక్ష్మీదేవమ్మ ఎంపీపీగా ఏకగ్రీవం
వెల్దుర్తి మార్చి 28 యువతరం న్యూస్:
వెల్దుర్తి మండలం ఎంపీపీ ఎన్నికల కార్యక్రమం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారిని తులసి దేవి ఆధ్వర్యంలో గురువారం ప్రశాంతంగా నిర్వహించారు. మొదట వెల్దుర్తి ఎంపీటీసీ 2 బొమ్మన రవీంద్రనాథరెడ్డి ఎంపీపీ అభ్యర్థిగా లక్ష్మీ నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మీదేవమ్మను బలపరిచారు. అనంతరం చెరుకులపాడు ఎంపీటీసీ మరియు వైస్ ఎంపీపీ అయినా రాజేశ్వరమ్మ ఎంపీపీ అభ్యర్థిగా దేశాయి లక్ష్మీదేవమ్మ ను బలపరచడం జరిగింది. దీంతో ఎంపీటీసీలు ఎంతమంది మద్దతు ఇస్తున్నారు చేతులు ఎత్తవలసిందిగా ప్రెసిడింగ్ అధికారిని ఎంపీటీసీలను కోరారు. దీంతో 14 మంది ఎంపీటీసీలు మద్దతు తెలుపుతున్నట్లు చేతులు ఎత్తడం జరిగింది.అదనపు నామినేషన్లు ఏమీ రాకపోవడంతో ప్రెసిడింగ్ అధికారిని తులసీదేవి లక్ష్మీనగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మీ దేవమ్మ ఎంపీపీ గా ఎన్నిక అయినట్లు అధికారికంగా ప్రకటించి ధ్రువపత్రాన్ని కర్నూలు జాయింట్ కలెక్టర్ నవ్య చేతుల మీదుగా అందజేశారు. జాయింట్ కలెక్టర్ నవ్య ఎన్నికల సరళిని పరిశీలించడం జరిగింది.అనంతరం ఎంపీపీ కార్యాలయంలో ఆసీనులను చేశారు. అనంతరం ఎంపీపీ దేశాయి లక్ష్మి దేవమ్మ మాట్లాడుతూ తన ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా దేశాయి సమీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన తల్లి లక్ష్మి దేవమ్మ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలిపారు. మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ తమ ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరములు తాము ఎంపీపీగా చేయడం జరిగిందన్నారు. అనంతరం రాజీనామా చేసామన్నారు. తమ మధ్య భిన్నభిప్రాయాలు లేవని పార్టీ అభిప్రాయమే తమ అభిప్రాయం అన్నారు. మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు.