బొమ్మిరెడ్డి పల్లె ఉపసర్పంచ్ తెలుగుదేశం కైవసం

బొమ్మిరెడ్డి పల్లె ఉపసర్పంచ్ తెలుగుదేశం కైవసం
ఉప సర్పంచ్ గా మోదిపల్లి రామాంజనేయులు ఏకగ్రీవం
వెల్దుర్తి మార్చి 28 యువతరం న్యూస్:
వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డి పల్లె గ్రామ ఉపసర్పంచ్ గా తెలుగుదేశం మద్దతుదారుడు మోదిపల్లి రామాంజనేయులు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. గతంలో ఉన్న ఉపసర్పంచ్ చిన్న పాపయ్య మృతి చెందడంతో ఉప ఎన్నికకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అధికారి రవి కిషోర్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. 8 మంది వార్డు మెంబర్లు ఉండగా 5 మంది వార్డు మెంబర్లు రామాంజనేయులు కు మద్దతుగా చేతులెత్తారు. దీంతో రామాంజనేయులు ఉపసర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రవి కిషోర్ ప్రకటించారు. అనంతరం ఆయనకు ధ్రువ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ తమ పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తన విజయాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదనారావు, వెల్దుర్తి ఎస్ఐ అశోక్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.