ANDHRA PRADESHPOLITICS
మంత్రి లోకేష్ ను కలిసిన ఖాజావలి

మంత్రి లోకేష్ ను కలిసిన ఖాజావలి
మంగళగిరి ప్రతినిధి మార్చి 26 యువతరం న్యూస్:
ఉండవల్లిలోని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నివాసంలో సోమవారం మంత్రి లోకేష్ ను నవులూరుకి చెందిన టీడీపీ నాయకులు షేక్ ఖాజావలి తన కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను గత 25 సంవత్సరాల నుంచి నాటి పార్టీ పూర్వ ఇంచార్జ్ మాదల రాజేంద్ర నాయకత్వం నుంచి నేటి వరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ, విధేయుడుగా ఉంటున్నానన్నారు. తమ సేవలను గుర్తించి తన పేరును నామినేట్ పదవులకు సిఫార్సు చేయాలని మంత్రి లోకేష్ ను కోరానని ఖాజావలి తెలిపారు.