ఫైలేరియా వ్యాధి పై అవగాహన

ఫైలేరియా వ్యాధి పై అవగాహన
మంగళగిరి ప్రతినిధి మార్చి 26 యువతరం న్యూస్:
మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సీలో మంగళవారం హెల్త్ సెంటర్ పరిధిలో బోదకాలు వ్యాధికస్తులకు మలేరియా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫైలేరియా వ్యాధి గురైన అవయవాన్ని శుభ్రపరచుకునేందుకు ఉచితంగా వస్తువులు, మందులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా గుంటూరు సహాయ మలేరియా అధికారి రాజు నాయక్ హాజరై రోగులకు వస్తువులు, మందులు పంపిణీ చేశారు. హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష ఫైలేరియా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగులు వ్యాధికి గురైన శరీర భాగాలను ఎలా సంరక్షించుకోవాలి, శుభ్రపరచుకోవాలి తదితర విషయాలను అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ భరత్, డాక్టర్ సంహిత్, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ, సూపర్వైజర్లు సాగర్, సైదులు, హెల్త్ అసిస్టెంట్ కడియం శ్రీనివాసరావు, ఆశాలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.