ANDHRA PRADESHCRIME NEWSOFFICIAL

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్

కర్నూలు క్రైమ్ మార్చి 23 యువతరం న్యూస్:

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 94 ఫిర్యాదులు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.
కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి సోమవారం మొత్తం 94 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) క్రిష్ణ వర్ష పొదుపు సంఘంలో రూ. 8 లక్షలు తీసుకొన్నాము. ప్రతి నెల కంతులు కట్టించుకున్నారు. పొదుపు సంఘంలోని లీడర్లైన సభ్యులు బ్యాంకు కు డబ్బులు కట్టకుండా మోసం చేశారని బ్యాంకు నుండి నోటిసులు వచ్చాయని కర్నూలు, నిర్మల్ నగర్ కు చెందిన పల్లవి, రషీద, విజయలక్ష్మీ మరియు ఇతర సభ్యలు ఫిర్యాదు చేశారు.
2) నా పెద్ద కుమారుడు ఇల్లురాసి ఇవ్వాలని, ఇంటి, కుళాయి పన్నులు కట్టకుండా ఇంటి పట్టాలు తీసుకెళ్ళి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కర్నూలు, కోత్తపేటకు చెందిన సుంకులమ్మ ఫిర్యాదు చేశారు.
3) ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలు కు చెందిన సూర్య మాధవరావు రూ. 6 లక్షల 50 వేలు తీసుకొని మోసం చేశాడని కర్నూలు , వెంకటరమణకాలనీకి చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు.
4) వాటర్ ప్లాంట్ ఫిట్టింగ్ చేస్తానని చెప్పి ఒక లక్ష రూపాయలు తీసుకొని కర్నూలు కు చెందిన వారిష వాటర్ టెక్స్ మున్నా మోసం చేశాడని కర్నూలు , మద్దూర్ నగర్ కు చెందిన రామ్ మూర్తి ఫిర్యాదు చేశారు.
5) కోడుమూరు వెంకటగిరిలో ఉన్న రెండున్నర ఎకరాల పొలాన్ని రంగమ్మ డబ్బులు తీసుకుని అమ్మినది. మనవడు గిడ్డయ్య అడ్డుపడి ఆమె ను రిజిష్టర్ చేయనియవ్వ కుండా మోసం చేస్తున్నాడని కర్నూలు కు చెందిన అంజనమ్మఫిర్యాదు చేశారు.
6) పట్టాబిరామయ్య కుటుంబఅవసరాల కోసం డబ్బులు తీసుకోని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కర్నూలు , సంతోషనగర్ కు చెందిన రహీంబీ ఫిర్యాదు చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ హామీ ఇచ్చారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, సిఐలు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!