నిరాడంబరంగా కె.వి. సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు

నిరాడంబరంగా కె.వి. సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు
టిడిపి కార్యాలయంలో నేతల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కే వి సుబ్బారెడ్డి
కర్నూలు టౌన్ మార్చి 23 యువతరం న్యూస్:
కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత కె.వి సుబ్బారెడ్డి తన 68వ జన్మదిన వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుబ్బారెడ్డి కేక్ కట్ చేసి అందరి చేతుల మీదుగా అందరికీ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కే.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ జన్మ దిన వేడుక తనకు ఎంతో ప్రత్యేకమన్నారు.
అందరిలాగా 60 ఏళ్ళు నిండిన వెంటనే తాను షష్టి పూర్తి చేసుకోలేదని.. కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు ప్రాంతాల్లో తాను విస్తృతంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. మార్చి 24 తో తానకు 68 సంవత్సరాలు పూర్తి నిండాయన్నారు.
భగవంతుడి ఆశీస్సులు తనపై మరికొన్నిళ్లు ఉంచితే తన సంపాదనలో అధిక శాతం సామాజిక సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తాను అని చెప్పారు.
ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో తాను ఎక్కడ కూడా విందు బోనాలు ఏర్పాటు చేయలేదని, త్వరలోనే అందరికీ పార్టీ కార్యాలయంలో మంచి విందు భోజనం ఏర్పాటు చేస్తానని అన్నారు. జన్మదినం సందర్భంగా తనను సత్కరించి. శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.