వేసవి తీవ్రత దృష్ట్యా పిజిఆర్ఎస్ కార్యక్రమం ఉ.9:30 నుండి మ.12:30 గం.ల వరకు

వేసవి తీవ్రత దృష్ట్యా పిజిఆర్ఎస్ కార్యక్రమం ఉ.9:30 నుండి మ.12:30 గం.ల వరకు
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల కలెక్టరేట్ మార్చి 24 యువతరం న్యూస్:
వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉ.9:30 గం.లకు ప్రారంభించి మ.12:30 గం.లకు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో అర్జీల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉ.9:30 గం.లకు ప్రారంభించి మ.12:30 గం.లకు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలందరూ గమనించి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు.