ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALWORLD
బిల్‌గేట్స్‌తో చంద్రబాబు సమావేశం

బిల్‌గేట్స్‌తో చంద్రబాబు సమావేశం
న్యూఢిల్లీ మార్చి 20 యువతరం న్యూస్:
సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ ఎలా సహకరించవచ్చనే దానిపై వారు చర్చలు జరిపారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలలో సేవు మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.