ANDHRA PRADESHBREAKING NEWSPOLITICS
35 మంది పై కేసు నమోదు

35 మంది పై కేసు నమోదు
తిరుపతి ప్రతినిధి మార్చి 20 యువతరం న్యూస్:
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసం పై విన్నూత్న నిరసన తెలిపిన వైసీపీ నాయకులపై కేసు.
35 మందిపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరుకు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కి ఉచిత ప్రయాణం అంటూ ప్రయాణించిన వైసీపీ మహిళా కార్యకర్తలు.
ఉచిత ప్రయాణం లేదు టికెట్ తీసుకోవాలని కోరిన కండక్టర్. టికెట్ తీసుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన పీలేరు పల్లె వెలుగు కండక్టర్.తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్న కండక్టర్.ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.