ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWS
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సంఘటనా స్థలంలో నలుగురు మృతి

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
ఆదోని మార్చి 11 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని జాలిమంచి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కర్ణాటక ఆర్టీసీ బస్సు, రెండు బైక్లను ఢీ కొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.కర్ణాటక రాష్ట్రం గంగావతి డిపోకు చెందిన బస్సు ఆదోని నుంచి రాయచూరు కు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసకుంది.కుప్పగల్ గ్రామం ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు. భర్త ఈరన్న,భార్య ఆదిలక్ష్మి కూతురు సుస్మిత అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.హేమాద్రి హోంగార్డు తీవ్రగాయాలు భార్య అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో పెద్ద తుంబలం పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది.