శ్రీ సిద్దేశ్వర స్వామి వారికి వెండి నాగాభరణం బహుకరణ

శ్రీ సిద్దేశ్వర స్వామి వారికి వెండి నాగాభరణం బహుకరణ
వెల్దుర్తి ఫిబ్రవరి 25 యువతరం న్యూస్:
మండల కేంద్రం అయిన వెల్దుర్తి లోని కొలను బావి దగ్గర వెలసినటువంటి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయంలో శివయ్యకు వెండి ఆభరణాలు బహుకరణ ఇవ్వడం జరిగింది. వివరాలలోకి వెళ్ళగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి కి చెందిన మానవ పాటి సుబ్బారెడ్డి, మానవ పాటి వరలక్ష్మి గార్ల కుమారులు అయినటువంటి మానవ పాటి సుధీర్ రెడ్డి, సుమన్ కుమార్ రెడ్డి ఇరువురు కుటుంబ సభ్యులతో కలిసి కొలను బావి దగ్గర వెలిసినటువంటి శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయంలో శివుడికి వెండితో చేయించినటువంటి నాగ ఆభరణం అలంకరించడం జరిగింది. మాకు మరియు మా కుటుంబ సభ్యులకు తరతరాలుగా మంచి చేకూరుస్తున్న మాకు దీవెనలు అందిస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మా ఇంటి దైవంగా మమ్మల్ని రక్షించే రక్షకుడిగా ఉండడం మాకు సంతోషకరమని మమ్మల్ని అంచలంచెలుగా ఎదిగేలా చేస్తున్న మా ఇంటి దైవానికి మా వంతుగా మేము చేస్తున్నటువంటి చిన్న పాటి సేవగా మేము ఈరోజు శివయ్యను అలంకరించడానికి నాగ ఆభరణం చేయించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వెండి నాగ ఆభరణం విలువ సుమారు రెండు లక్షల పైగా ఉన్నట్టు గుడి పూజారులు తెలపడం జరిగింది.