అనుమతి ఉన్న లే అవుట్లనే కొనుగోలు చేయాలి: మంత్రి నారాయణ

అనుమతి ఉన్న లే అవుట్లనే కొనుగోలు చేయాలి: మంత్రి నారాయణ
త్వరలోనే అప్రూవ్డ్, నాన్ అప్రూవ్డ్ లేఅవుట్లపై ప్రత్యేక యాప్
అమరావతి ప్రతినిధి ఫిబ్రవరి 19 యువతరం న్యూస్:
అనుమతి ఉన్న లేఅవుట్ల వివరాలను సంబంధిత వెబ్సైట్లో పొందుపరుస్తామని వాటినే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో నిబంధనలను ప్రజలకు అనుకూలమైన విధంగా సడలించామని వాటిని సద్వినియోగం చేసుకో వాల్సిందిగా కోరారు. గతంలో మాదిరి నిబంధనలను అతిక్రమించి లేఅవుట్లు ఇళ్ల నిర్మాణం చేపడితే చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే నిబంధనలను పాటించకుండా వేసినటువంటి వెంచర్ల విషయంలో రాబోయే రెండు నెలల్లో ప్రజలకు లేఔట్ నిర్మాణదారులకు ఇరువైపులా నష్టపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, త్వరలోనే అప్రూవ్డ్, నాన్ అప్రూవ్డ్ లేఅవుట్లపై యాప్ ను సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.