వెల్దుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి

వెల్దుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి
వెల్దుర్తి నవంబర్ 9 యువతరం న్యూస్:
తరాలు మారుతున్నా వెల్దుర్తి తలరాత మారలేదని వెల్దుర్తి మండల ప్రజలు పేర్కొంటున్నారు. మండల కేంద్రమైన వెల్దుర్తిలో చాలా సంవత్సరములుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని మండల ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు తమ భవిష్యత్తు మెరుగుపరుచుకోవాలంటే వెల్దుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు తెలుపుతున్నారు. సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు కల్పించుకుని వెల్దుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థిని,విద్యార్థులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం డిగ్రీ చదవాలంటే వెల్దుర్తి నుండి కర్నూలు లేదా డోన్ తదితర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవలసి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంత దూరం తమ తల్లిదండ్రులు పంపలేకపోవడంతో చదువు మధ్యలోనే ఆపివేయాల్సి వస్తుంది అన్నారు. కాబట్టి సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులు కల్పించుకొని మండల కేంద్రమైన వెల్దుర్తి లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయించవలసిందిగా వారు కోరుచున్నారు.