ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALSTATE NEWS
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్షాలు ఎక్కడంటే…????

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
అమరావతి యువతరం డెస్క్:
ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వైపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది.
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, కడప, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు.
మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో ఈదురుగాలులు.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దు.
వరద నీటిలో స్నానాలు, ఈతకు, చేపల వేటకు వెళ్లొద్దు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుకుంది.