
రోడ్లపై మురుగునీరు నిలవకుండా చర్యలు తీసుకోండి
– స్పెషల్ ఆఫీసర్ రాంప్రసాద్
భద్రాద్రి ప్రతినిధి జూన్ 15 యువతరం న్యూస్:
ప్రధాన రహదారి వెంబడి రోడ్లపై మురుగు నీరు నిల్వ లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, పినపాక మండల స్పెషల్ ఆఫీసర్ రాంప్రసాద్ పంచాయతీ అధికారులకు సూచించారు. శుక్రవారం పినపాక మండలంలో ఈ బయ్యారం, తోగూడెం , పినపాక గ్రామ పంచాయతీలలో ఆయన స్థానిక ఎంపీఓ వెంకటేశ్వరరావుతో కలిసి పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ఈ బయ్యారం ప్రధాన రహదారిపై వాటర్ ట్యాంక్ సమీపంలో డ్రైనేజీ నుంచి నీరు బయటకు పోకుండా నిల్వ ఉండడంతో వెంటనే డ్రైనేజీని శుభ్రం చేయించాలని స్థానిక పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో డ్రైనేజీలో నీరు నిలిస్తే దోమలు పెరిగే అవకాశం ఉందని దీంతో విష జ్వరాలు వ్యాపిస్తాయని ప్రజల ఆరోగ్యం కూడా మన బాధ్యత అని గుర్తు చేశారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో సైతం డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. తోగూడెం గ్రామపంచాయతీ లో పర్యటించి అక్కడ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, సెక్రటరీ జయపాల్ రెడ్డి, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.