ANDHRA PRADESHCRIME NEWS

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం

జిల్లా ఎస్పీ జీ కృష్ణ కాంత్

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ  జి. కృష్ణ కాంత్

స్పందన కార్యక్రమానికి 92 ఫిర్యాదులు

స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ

(యువతరం సెప్టెంబర్ 25) కర్నూలు ప్రతినిధి

జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ  జి. కృష్ణ కాంత్  సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 92 ఫిర్యాదులు వచ్చాయి.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …

1) గురుకుల పాఠశాలలో ఫిజికల్ ట్రైనర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 3 లక్షలు తీసుకొని మోసం చేశారని కర్నూలుకు చెందిన , రమిజాబి ఫిర్యాదు చేశారు.

2) ఆన్ లైన్ meeshow లో ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ వచ్చిన తర్వాత చూసి నచ్చకపోతే రిటర్న్ పంపినాము. Meeshow యాప్ కస్టమర్ కాల్ అని మాకు ఫోన్ వచ్చింది , వివరాలు అడిగితే చెప్పాము. రూ. 1 లక్ష 26 వేలు నా బ్యాంకు ఖాతా నుండి దొంగలించారని న్యాయం చేయాలని కర్నూలు, సంపత్ నగర్ కు చెందిన హీనాబి ఫిర్యాదు చేశారు.

3) ఫ్లాట్స్ వ్యాపారంలో నా భర్త భాగస్వామి గా ఉండి ఇటీవల చనిపోయారు. నా భర్త భాగానికి వచ్చే డబ్బులు ఇస్తామని ఇవ్వడం లేదని కర్నూలు కు చెందిన గౌసియా ఫిర్యాదు చేశారు.

4) నా భర్త కర్నూలు , లక్ష్మీనగర్ లో సంతోషి మాన్సన్ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకున్నారు. నా భర్త ఇటీవల చనిపోవడంతో ప్లాట్ అమ్మిన వాళ్ళు ఆ ప్లాట్ మాదే నని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బెంగూళూరు కు చెందిన శాంతి దీప్తి ఫిర్యాదు చేశారు.

5) బెంగుళూరు ఇన్ ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని ఒక వ్యక్తి 1 లక్ష 50 వేలు తీసుకొని మోసం చేశాడని క్రిష్ణగిరి మండలం, కోటకొండ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు.

6) రూ. 30 లక్షలు కట్టిన తర్వాత ప్లాట్ రిజిస్ట్రేషన్ చేశారు. కిడ్నీ ఆపరేషన్ జరగడంతో డాక్యుమెంట్స్ తీసుకోలేదు. ఇప్పుడు ప్లాట్ రేటు పెరిగిందని డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదని కర్నూలు , వడ్డేగేరి కి చెందిన విజేత ఫిర్యాదు చేశారు.

స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ  జి. కృష్ణ కాంత్   హామీ ఇచ్చారు.

ఈ స్పందన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ టి. సర్కార్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐలు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!