ANDHRA PRADESHPOLITICSSTATE NEWS

రాయలసీమ మహాసభలను జయప్రదం చేయండి

రాయలసీమ మహాసభలను జయప్రదం చేయండి

కడప యువతరం ప్రతినిధి;

దశాబ్దాల కాలం నుండి వెనక్కి నెట్టబయబడుతున్న రాయలసీమను, అందులోని సమస్యలను పాలక ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకునే విధంగా మన అందరం చేయి చేయి కలిపి పోరాటాలకు నడుము బిగించాలని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్ సి పి) చింతకొమ్మదిన్నె మండల కార్యదర్శి మడగలం ప్రసాద్ పిలుపునిచ్చారు.
శుక్రవారం ఇందిరానగర్ లోని వారి కార్యాలయం నందు విలేకరులతో మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతం వెనుకబాటుతనంతో మగ్గుతున్నదని ఈ పరిస్థితులను రూపుమాపాల్సిన రాజకీయ నాయకులు మాత్రం ఓట్లు సీట్లు అంటు రాజకీయం చుట్టూ తిరుగుతూ రాయలసీమ ప్రజలను, వారి సమస్యలను విస్మరించారని, రాయలసీమ అభివృద్ధికి ఉద్దేశపూర్వకంగానే వారు అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు.
మానవ వనరులు, ఖనిజ సంపద, సహజ వనరులు అన్ని రాయలసీమ ప్రాంతంలో ఉన్న అవకాశాలు లేక సీమ ప్రజలు వలసలతో, నిత్యం కరువులతో, ఆత్మహత్యలతో అల్లాడుతున్నారని, పాలకులు ప్రతిపక్షాలు ఇద్దరూ సీమవాసులే అయినప్పటికీ రాయలసీమకు ఒరిగిందేమీ లేదని, ఆయన అన్నారు.
పాలక ప్రతిపక్షాలు చేస్తున్న అన్యాయం పట్ల సీమ ప్రజలు ఉద్యమించకపోతే! సీమ ఎడారి గాను, స్మశానంగాను మారుతుందని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమించిన విధంగా ఉక్కు సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఉద్యమాలలోకి రావాలని ఆయన కోరారు. దీనికి సంబంధించిన అనేక విషయాలను చర్చించుకునేందుకు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఈనెల 29, 30 తేదీలలో నగరంలో రాయలసీమ మహాసభలు నిర్వహిస్తుందని, ఈ సభలను విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరు విరివిగా విరాళాలు అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఇందిరానగర్ కార్యదర్శి రవి, పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!